Subbayyammapeta: సుబ్బయ్యమ్మపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గొల్లవిల్లి చిన్నారి!

Subbayyammapeta: సుబ్బయ్యమ్మపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గొల్లవిల్లి చిన్నారి అలియాస్ వెంకటనారాయణమ్మను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం ప్రకటించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 14 Nov 2026 2:29 PM IST
Subbayyammapeta
X

Subbayyammapeta: సుబ్బయ్యమ్మపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గొల్లవిల్లి చిన్నారి!

సుబ్బయ్యమ్మపేట: స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సుబ్బయ్యమ్మపేట గ్రామపంచాయతీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లవిల్లి అప్పలరాజు సతీమణి గొల్లవిల్లి చిన్నారి అలియాస్ వెంకటనారాయణమ్మను ప్రకటించారు.

కూటమి పార్టీలు, గ్రామ నాయకుల ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థిని కూటమి నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గొల్లవిల్లి చిన్నారి అలియాస్ వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహకారంతో నిరంతరం పని చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొండా శ్రీనుబాబు, జనసేన గ్రామ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీను, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొండా శ్రీను, సీనియర్ టీడీపీ నాయకులు గొల్లవిల్లి రాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA