Tuni: తునిలో రూ.85 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!
Tuni: తునిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం. తునిలో రూ.85 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
Tuni: తునిలో రూ.85 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!
తుని: తునిలో ఇవాళ రూ.85 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది. తుని అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.208 కోట్లతో సమగ్ర ప్రణాళికలు అమలుపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణను కలిసి అనుమతులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు; త్వరలోనే మరిన్ని నిధులు, అనుమతులు సాధిస్తాం.
రూ.61 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి; ఇందులో భాగంగా రూ.21 కోట్లతో 63 రోడ్లను నిర్మించి, పాత రోడ్లను సువిశాల రహదారులుగా విస్తరించాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు 11 పార్కుల నవీకరణ పూర్తి చేశాం.
ఇచ్చిన హామీ మేరకు రూ.15 కోట్లతో ఇంటింటికీ నాణ్యమైన త్రాగునీరు అందిస్తున్నాం. ఇసుకలపేటలో రూ.14.26 కోట్లతో మురుగుశుద్ధి ప్లాంట్ (సెవెంజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం తునిపై పడకుండా తాండవ, పంపా జలాశయాలతో పాటు స్థానిక చెరువుల్లోకి నీటిని మళ్లించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఇప్పటికే పోలవరం నీటిని తాండవ షుగర్ ఫ్యాక్టరీ వద్ద తాండవ నదిలోకి మళ్లించడం ద్వారా తుని పట్టణాన్ని త్రాగునీటి సమస్య నుంచి విజయవంతంగా గట్టెక్కించగలిగాం.




