Pithapuram: చేనేత రంగానికి పవన్ కళ్యాణ్ పూర్తి అండ: నాగేంద్రబాబు
Pithapuram: గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ నాగేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను సన్మానించారు.
Pithapuram: చేనేత రంగానికి పవన్ కళ్యాణ్ పూర్తి అండ: నాగేంద్రబాబు
చేనేత రంగానికి పవన్ కళ్యాణ్ అండదండలు – ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు.
జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ , డీసీసీబీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు , మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు , ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ , ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేనేత రంగానికి అండగా నిలుస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచడం ద్వారా సంప్రదాయ చేనేత పరిశ్రమను పరిరక్షించవచ్చని, ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగం మరింత అభివృద్ధి చెందాలని, చేనేత కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.




