Jaggampeta: ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి: కలెక్టర్ హరేంధీర ప్రసాద్

Jaggampeta: తాళ్లూరు రైతులు జిల్లాకే ఆదర్శం కావాలి.. వరి స్థానంలో పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 17 Jun 2026 3:46 PM IST
Jaggampeta
X

Jaggampeta: ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి: కలెక్టర్ హరేంధీర ప్రసాద్

Jaggampeta: ఆయిల్ పామ్ విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధీర ప్రసాద్

రైతులు ముందుకు రావాలని పిలుపు

తాళ్లూరు రైతులు పామాయిల్ తోట పెంపకంలో జిల్లాకి ఆదర్శం కావాలని హేతవు

గండేపల్లి, పెన్ పవర్, జూన్, 17

జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించిన ఆయిల్ పామ్ విస్తరణ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధీర ప్రసాద్ ఆయిల్ పామ్ మొక్కను నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశీయ వంటనూనెల అవసరాలను తీర్చడంలో ఆయిల్ పామ్ సాగు కీలక పాత్ర పోషిస్తుందని, రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే పంటగా ఆయిల్ పామ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీటి వసతి ( బోరు ,బావులు) తో వరి పంట పందిడిస్తున్న రైతులు అందరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. తాళ్లూరు గ్రామం 30 మంది రైతులు ఈ సంవత్సరం 60 ఎకరాల ఆయిలపామ్ పంట సాగుకు తో పంట మార్పిడి చేసుకున్నారు అని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆయిల్ పామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశమై ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలు, సాగు విధానాలు మరియు ప్రభుత్వ సహాయ కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉద్యానవన శాఖాధికారి టీ .వీర సిరిల్ ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సహాయం మరియు అంతర పంటల ప్రోత్సాహకాలు, గురించి రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి ఏ.శ్రీవల్లి ఏడిఏ , జి .శ్రీనివాస్ ఎంపీడీవో, సత్య హరి కృష్ణ రెడ్డి, తహసీల్ధర్ కె.పద్మజ పతంజలి ఫుడ్స్ టివి ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ పామ్ సంస్థల ప్రతినిధులు హెడ్ ప్లాంటేషన్స్ వి, పాటభి రామి రెడ్డి, ఏజీఎండి . రవీంద్ర, ప్రజాప్రతినిధులు పైని వెంకటేశ్వరావు, పాలచర్ల సత్యనారాయణ, కొండ్రు అప్పలరాజు, ఎంపీటీసీ చెల్లూరి. రాంబాబు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story