Pithapuram: మాకు అండగా నిలిచేవారిపైనే ఆరోపణలా? మూలపేట జనసేన నేతలు ఆగ్రహం!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మూలపేటలో జనసేన నేతల ప్రెస్మీట్. ఎస్ఎంసీ ఎన్నికల విజయంపై స్పందన.
Pithapuram: మాకు అండగా నిలిచేవారిపైనే ఆరోపణలా? మూలపేట జనసేన నేతలు ఆగ్రహం!
Pithapuram: కొత్తపల్లి మండలం. పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధితో జనసేనపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మూలపేట నేతలు తెలిపారు.
SMC ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థి విజయమే ఇందుకు నిదర్శనమన్నారు. రెండు రోజులుగా రావు అక్షయ్ తమతోనే ఉండి గెలుపు కోసం కృషి చేశారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిపై కొందరు నాయకులు ప్రెస్మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గతంలో ఆ నాయకులెవరూ తమకు సహకరించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తమకు అండగా నిలిచేవారిపైనే ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.




