Tuni: ఎస్.అన్నవరం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరిశే మంగాదేవి నామినేషన్!

Tuni: కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం ఎంపీటీసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరిశే మంగాదేవి నామినేషన్ దాఖలు చేశారు.

MANIKANTA, TUNI
Published on: 23 Oct 2026 12:39 PM IST
Tuni
X

Tuni: ఎస్.అన్నవరం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరిశే మంగాదేవి నామినేషన్!

Tuni: తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ రెండవ సెగ్మెంట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరిశే మంగాదేవి (వైసిపి నాయకులు నరిశే వెంకట సూర్యనారాయణమూర్తి-యన్.వి. భార్య) శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిపి) కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.

దాడిశెట్టి రాజాను కలిసిన మంగాదేవి:

నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం, మంగాదేవి మరియు యన్.వి. దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో వైయస్సార్‌సిపి విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, పార్టీ గెలుపు కోసం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI