Prathipadu: తుఫాన్ ప్రభావంతో ఒమ్మంగి-శరభవరం రహదారి మూసివేత!

Prathipadu: తుఫాన్ ప్రభావంతో వర్షాల కారణంగా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి-శరభవరం రహదారిని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 24 Sept 2026 5:43 PM IST
Prathipadu
X

Prathipadu: తుఫాన్ ప్రభావంతో ఒమ్మంగి-శరభవరం రహదారి మూసివేత!

Prathipadu: ప్రత్తిపాడు మండలంలో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒమ్మంగి-శరభవరం రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

రహదారిపై వర్షపు నీరు చేరి ప్రమాదకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం, తహశీల్దార్ ఎం సూర్యప్రభ, ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్ బాబు తెలిపారు.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహదారి గుండా ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.ఒమ్మంగి నుంచి శరభవరం వైపు వెళ్లే వారు ఉత్తరకంచి, పొదురుపాక మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే శరభవరం, పోతులూరు, చింతలూరు తదితర గ్రామాల ప్రజలు కొడవలి మీదుగా రాకపోకలు సాగించాలని అధికారులు సూచించారు.

రహదారి పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు సాగించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU