Tuni: తునిలో మృత్యుకూపంగా మారిన మ్యాన్ హోల్ పట్టించుకోని అధికారులు!

Tuni: తుని పాత బజార్ వీధి-కొబ్బరి తోట మార్గంలో మూతలేని మ్యాన్ హోల్.. ప్రమాదకరంగా మారిన గుంతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి.

MANIKANTA, TUNI
Published on: 12 Sept 2026 8:57 AM IST
Tuni
X

Tuni: తునిలో మృత్యుకూపంగా మారిన మ్యాన్ హోల్ పట్టించుకోని అధికారులు!

Tuni: కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పాత బజార్ వీధి నుంచి కొబ్బరి తోటకి వెళ్లే ప్రధాన మార్గంలో అధికారులు నిర్లక్ష్యం ప్రయాణికులకు, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ మార్గంలో ఉన్న ఒక మ్యాన్ హోల్ మోత (మూత) పూర్తిగా కొట్టుకుపోయి లేదా ధ్వంసమై ప్రమాదకరంగా తెరుచుకుని ఉంది. అయినా సంబంధిత మున్సిపల్ అధికారులు కనీసం స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిత్యం ప్రాణభయంతోనే ప్రయాణం..

ప్రతిరోజూ ఉదయం పూట ఈ మార్గం గుండానే చిన్నారులు బడులకు వెళ్తుంటారు. అంతేకాకుండా సమీపంలోని దేవాలయాలకు వెళ్లే భక్తులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ఇదే దారిని నమ్ముకుంటారు.

రాత్రి వేళల్లో ఈ వీధిలో సరైన వెలుతురు (వీధి దీపాలు) లేకపోవడంతో డ్రైనేజీ గుంత కనిపించక వాహనదారులు అడుగుతప్పి అందులో పడిపోయి గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. చీకట్లో ఏ చిన్నపాటి అజాగ్రత్త జరిగినా పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని, ప్రాణ నష్టం జరిగే వరకు అధికారులు మారరా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోనస్‌గా చెత్తాచెదారం..

ప్రమాదకరంగా మారిన ఈ గుంత పక్కనే కొందరు చెత్తాచెదారాన్ని కుప్పలుగా పడేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎటు చూసినా పేరుకుపోయిన చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో అటువైపు నడిచివెళ్లలేని దుస్థితి నెలకొంది. దోమలు, ఈగలు చేరి అసంక్రమ్య వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

స్పందించాలని ప్రజల డిమాండ్..

చిన్నపిల్లలు, వృద్ధుల ప్రాణాలను హరించేలా ఉన్న ఈ మ్యాన్ హోల్‌కు తక్షణమే బలమైన మూత (స్లాబ్) ఏర్పాటు చేయాలని, అలాగే ఆ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతను కాపాడాలని తుని పట్టణ ప్రజలు, ప్రయాణికులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెను ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI