Kakinada: ఘనంగా మెన్స్ట్రువల్ హెల్త్ మేనేజ్‌మెంట్ అవగాహన కార్యక్రమం

Kakinada: పాడా (PADA) ఆధ్వర్యంలో యు.కొత్తపల్లిలో ఘనంగా ఋతుక్రమ పరిశుభ్రత అవగాహన సదస్సు.

RAMA KRISHNA, KKD
Published on: 29 May 2026 4:49 PM IST
Kakinada
X

Kakinada: ఘనంగా మెన్స్ట్రువల్ హెల్త్ మేనేజ్‌మెంట్ అవగాహన కార్యక్రమం

కాకినాడ: పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) ఆధ్వర్యంలో, BROWS స్వచ్ఛంద సంస్థ, Evidence Action మరియు Greenko వారి సహకారంతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మెన్స్ట్రువల్ హెల్త్ మేనేజ్‌మెంట్ (MHM) అవగాహన కార్యక్రమం యు.కొత్తపల్లి మండలం సురక్ష ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది.

మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి కిషోరి బాలికలు, అంగన్‌వాడీ టీచర్లు, వెలుగు సీసీలు మరియు యాక్టివ్ సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు, ఏఎన్‌ఎంలు, మహిళా పోలీస్ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాడా పీడీ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్, ఏపిడీ శ్రీమతి వసంత మాధవి, గైనకాలజిస్టులు డా. వరలక్ష్మి మరియు డా. ఆశా రమ్య, డా. జ్యోతుల శ్రీనివాస్, సీడీపీఓ శ్రీకళ, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ డా. రామ్మోహన్, శ్రీమతి నాగమణి పాల్గొని బాలికలకు ఆరోగ్య పరిరక్షణ, ఋతుక్రమ పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా నిపుణులు బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు మెన్స్ట్రువల్ హైజీన్‌పై సమగ్ర అవగాహన కల్పించారు. ఋతుక్రమంపై ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

అలాగే ఎఫ్‌కే పాలెం, విరవాడ, గోరస, కె. ఇసుకపల్లి, చెందుర్తి/కేఎచ్‌పేట, చిన్న జగ్గంపేట గ్రామాల నుండి టీఓటీ శిక్షణ పొందిన సభ్యుల బృందాలు మరియు శిక్షణ పొందిన బాలికలు కార్యక్రమంలో పాల్గొని అవగాహనా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాత్రికేయులు అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పాడా పీడీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story