U Kothapalli: నేత కార్మికులకు మెగా వైద్య శిబిరం!

U Kothapalli: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో నేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. పాడా (PADA) ఆధ్వర్యంలో 278 మందికి ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ.

RAMA KRISHNA, KKD
Published on: 11 July 2026 11:17 AM IST
Kothapalli
X

Kothapalli: నేత కార్మికులకు మెగా వైద్య శిబిరం!

U Kothapalli: యు.కొత్తపల్లి మండల నేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం

ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026 సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) సమన్వయంతో సురక్షా ప్యాలెస్, కొత్తపల్లి గ్రామంలో యు.కొత్తపల్లి మండలానికి చెందిన నేత కార్మికుల కోసం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.

ఈ వైద్య శిబిరంలో మొత్తం 278 మంది నేత కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలను పొందారు.

శిబిరంలో 11 రకాల ప్రయోగశాల పరీక్షలు నిర్వహించబడ్డాయి. వాటిలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, హెచ్‌ఐవీ (HIV), హెచ్‌బీఎస్‌ఏజీ (HBsAg), వీడీఆర్‌ఎల్ (VDRL), హిమోగ్లోబిన్ (Hb), రక్తంలో చక్కెర పరీక్ష (RBS), కఫ పరీక్ష (Sputum Examination) తదితర పరీక్షలు నిర్వహించారు.

అలాగే స్త్రీ రోగ నిపుణులు (Gynaecologist), చిన్నపిల్లల వైద్య నిపుణులు (Pediatrics), దంత వైద్య నిపుణులు (Dental), జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ మరియు ఫిజియోథెరపీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలందించి అవసరమైన చికిత్సలు, వైద్య సలహాలు అందించారు.

శిబిరంలో ఈసీజీ (ECG), ఎక్స్‌రే (X-Ray) పరీక్షలు కూడా నిర్వహించారు. అదేవిధంగా కిరణ్ ఐ హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.

ఈ వైద్య శిబిరం ద్వారా నేత కార్మికులకు సమగ్ర వైద్య సేవలు అందించడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందని తెలిపారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story