Pithapuram: దుర్గాడ గ్రామంలో పాడా పీడీ శివరామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పాడా పీడీ డాక్టర్ ఎన్.వి.శివరామ్ ప్రసాద్, జనసేన ఇంచార్జ్ జ్యోతుల శ్రీనివాస్ పర్యటించారు.
Pithapuram: దుర్గాడ గ్రామంలో పాడా పీడీ శివరామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు దుర్గాడ గ్రామంలో పాడా పిడి డా ఎన్.వి.శివరామ్ ప్రసాద్ దుర్గాడ గ్రామంలో రోడ్లను డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండల జనసేన ఇంచార్జ్ జ్యోతుల శ్రీనివాస్ గ్రామాన్ని మొత్తంనీ చూపిస్తూ గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎక్కువగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాటి కొరకు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం పాడా పిడి ఎన్.వి.శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ దుర్గాడ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని దాని పునఃరుద్దిస్తామని అలాగే సిసి రోడ్లు ఊర్లో మధ్యలో ఉన్న చెరువును నూతనంగా వాకింగ్ ట్రాకు మరియు జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని 80% వర్క్ పూర్తి అయిందని త్వరలోనే దాని ప్రారంభిస్తామని అన్నారు.
అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గెలిపించడంలో ఈ దుర్గాడ గ్రామం అత్యధిక 93% ఓటింగ్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగిందని దానికి సంతోషిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుర్గాడ గ్రామ ఇంచార్జ్, వివిధ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




