Tuni: తుని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై రోగుల ఆవేదన!
Tuni: కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అత్యవసర రోగులు తీవ్ర నరకయాతన పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Tuni: తుని ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై రోగుల ఆవేదన!
Tuni: కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితి తీవ్రంగా మసకబారుతోంది. రాత్రి వేళల్లో ఆసుపత్రికి వస్తున్న రోగులకు వైద్యుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. రాత్రి సమయంలో అత్యవసర చికిత్స కోసం వస్తే.. వైద్యులు గానీ, స్టాఫ్ నర్సులు గానీ అందుబాటులో ఉండటం లేదని రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ సిబ్బందిని ఎవరినైనా అడిగితే.. 'టీ తాగడానికి వెళ్లాం' అంటూ రకరకాల సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారే తప్ప, రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా, సమస్యను ప్రశ్నిస్తే అక్కడే ఉండే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, వైద్యులు మాత్రం సకాలంలో స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఎమర్జెన్సీ వార్డులో కూడా రాత్రి సమయంలో సిబ్బంది సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు మరియు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, తుని ఏరియా ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యుల పనితీరుపై నిఘా పెట్టాలని.. రోగులకు మెరుగైన వైద్యం అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు




