Pithapuram: పవన్ కళ్యాణ్ మానవత్వం రూ.2 లక్షల చెక్కుల పంపిణీ
Pithapuram: సామర్లకోట రోడ్డు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం, జనసేన పార్టీ భరోసా.
Pithapuram: పవన్ కళ్యాణ్ మానవత్వం రూ.2 లక్షల చెక్కుల పంపిణీ
పిఠాపురం: ఇటీవల పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమ జీవనోపాధి కోసం చేపల విక్రయ నిమిత్తం సామర్లకోట పట్టణానికి వెళ్తుండగా జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరియు ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన.
ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు మంజూరైన రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను పాడ పిడి శివరాం ఆధ్వర్యంలో పిఠాపురం ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ , కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు , మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు , ఓదురి కిషోర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ప్రమాదంలో తమ కుటుంబ పెద్దలను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, జనసేన పార్టీ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యంగా మృతుల పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పనిచేస్తోందని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఉన్న మానవత్వాన్ని, బాధ్యతాయుత నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పారని కొనియాడారు.ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం, అనాథలైన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కూటమి ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు సూరిశెట్టి జయకృష్ణ, దానం లాజర్ బాబు, పెంకే జగదీష్, కంచర్ల భవాని శంకర్, వంక కొండబాబు, మొగలి అప్పారావు, నక్క నారాయణాయ మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్య ప్రకాష్,స్థానిక నాయకులు,తెలగంశెట్టి వెంకటేశ్వరరావు,వేగిశెట్టి సూర్య నిఖిల్ ,మత్స అప్పజి,డా.జ్యోతుల శ్రీనివాస్,జనసేన పార్టీ జనసేన పార్టీ ప్రెసిడెంట్లు మరియు ఇతర జనసేన నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




