Pithapuram: యు. కొత్తపల్లిలో తాగునీటి విప్లవం.. పవన్ కళ్యాణ్ చొరవతో పనులు!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో వేగంగా కొనసాగుతున్న తాగునీటి పైప్‌లైన్ పనులు.
Pithapuram: యు. కొత్తపల్లిలో తాగునీటి విప్లవం.. పవన్ కళ్యాణ్ చొరవతో పనులు!
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అధిక నిధులు కేటాయించి యు. కొత్తపల్లి మండలంలో RWS (గ్రామీణ తాగునీటి) వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు.
మండల వ్యాప్తంగా కొత్త పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు.
దయచేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అతి త్వరలో మండల ప్రజలందరికీ సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించేందుకు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఎక్కడైనా తాగునీటి సమస్యలు లేదా ఇతర సంబంధిత ఇబ్బందులు ఉన్నట్లయితే దయచేసి జనసేన పార్టీ కార్యాలయానికి తెలియజేయండి.
మీ ఫిర్యాదుపై జనసేన పార్టీ కార్యాలయం వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.




