Kakinada: ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగాసనాలు వేసిన బీజేపీ నాయకులు

Kakinada: కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

TRIMURTULU, KOTHAPETA
Published on: 21 Jun 2026 5:15 PM IST
Kakinada
X

Kakinada: ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగాసనాలు వేసిన బీజేపీ నాయకులు

Kakinada: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పెదపూడి మండలంలోని వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించబడినట్లు పెదపూడి మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు నవాబ్ షేక్ సర్ధార్ హుస్సేన్ తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు మరియు ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులను ఆహ్వానించి యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత మరియు శారీరక దృఢత్వం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాలను వివరించారు.

ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని నవాబ్ షేక్ సర్ధార్ హుస్సేన్ పిలుపునిచ్చారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story