Peddapuram: ఎంపీటీసీగా విజయం సాధించిన బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మాధవపట్నం బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ ఎంపీటీసీ విజయంపై టీడీపీ నేత నిమ్మకాయల రంగనాగ్‌ను కలిసి కృతజ్ఞతలు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 9 Nov 2026 8:31 AM IST
Peddapuram: ఎంపీటీసీగా విజయం సాధించిన బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ!
X

Peddapuram: ఎంపీటీసీగా విజయం సాధించిన బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ!

Peddapuram: సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు విత్తనాల వెంకటరమణ ఎంపీటీసీగా విజయం సాధించడంతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీగా విజయం సాధించడానికి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడ్డాయని విత్తనాల వెంకటరమణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించిన ప్రజలు తనను ఆదరించి, ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపించారని ఆయన తెలిపారు.

తన విజయానికి సహకరించిన మాధవపట్నం గ్రామ ప్రజలకు విత్తనాల వెంకటరమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె వెంకటేష్ బాబు కూడా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వెంకటరమణ పేర్కొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM