Kakinada: ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు!
Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల బందోబస్తుపై డీఎస్పీ ఏబీజీ తిలక్ దిశానిర్దేశం. నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం.
Kakinada: ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు!
Kakinada: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ సూచించారు. శనివారం పోలీసు సిబ్బందికి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్సై పాపారావు తదితరులు పాల్గొన్నారు.




