Peddapuram: పెద్దాపురం మండల నూతన ఎంఈఓగా ఎం. సత్యవాణి బాధ్యతలు

Peddapuram: పెద్దాపురం మండల ఎంఈఓ-2గా ఎం. సత్యవాణి బాధ్యతల స్వీకరణ. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధికారిణి వెల్లడి.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 16 July 2026 8:59 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం మండల నూతన ఎంఈఓగా ఎం. సత్యవాణి బాధ్యతలు

పెద్దాపురం: పెద్దాపురం మండల నూతన విద్యా శాఖాధికారిణి - 2 గా ఎం సత్యవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంఈఓ సత్యవాణి మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఉపాధ్యాయులు, సిబ్బంది అందరి సహకారంతో పెద్దాపురం మండల విద్యా రంగాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతానని ఆమె అన్నారు. ఈ సందర్బంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్యవాణి ని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెచ్ ఎం లు కలిసి అభినందించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story