Peddapuram: పెద్దాపురంలో జూలై 10న మెగా జాబ్ మేళా
Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.
Peddapuram: పెద్దాపురంలో జూలై 10న మెగా జాబ్ మేళా
Peddapuram: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10వ తేదీన పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం అచ్చంపేట తన నివాస కార్యాలయంలో బుధవారం సాయంత్రం జాబ్ మేళా క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 1,500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఎలక్ట్రికల్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయని చెప్పారు.
పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని, ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జాబ్ మేళా విజయవంతం కోసం టీడీపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు, వికాస సిబ్బంది సహకరిస్తున్నారని తెలిపారు.
యువత తమ బయోడేటాతో పెద్దాపురంలోని సుధా కాలనీలో ఉన్న తెదేపా క్యాంపు కార్యాలయంలో జూలై 2 నుంచి 7వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. మరిన్ని వివరాలకు 9701836008, 9494550866 నంబర్లను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మెగా జాబ్ మేళాకు చెందిన క్యాలెండర్ లను ఎమ్మెల్యే చినరాజప్ప తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు, వికాస సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




