Kakinada: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం

Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో వర్షాలు కురవాలని కోరుతూ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో వరుణ యాగం.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 6 Oct 2026 12:45 PM IST
Kakinada
X

Kakinada: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం

Kakinada: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత విఘ్నేశ్వర పూజను శాస్త్రోక్తంగా కార్యనిర్వహణ అధికారిని విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు హాజరయ్యారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, వరుణ జపం, వరుణ యాగంలో వారు పాల్గొన్నారు.

ప్రజలకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని వారు ఆకాంక్షించారు. భక్తులు, స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు పాల్గొనడంతో కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా జరిగింది......

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM