Kakinada: పెద్దాపురం రైతు బజార్‌లో సబ్సిడీ సన్నబియ్యం కేంద్రం ప్రారంభం

Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం రైతు బజార్‌లో సబ్సిడీ సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 3 Aug 2026 5:37 PM IST
Kakinada
X

Kakinada: పెద్దాపురం రైతు బజార్‌లో సబ్సిడీ సన్నబియ్యం కేంద్రం ప్రారంభం

కాకినాడ జిల్లా.....

పెద్దాపురం నియోజకవర్గం......

సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా పెద్దాపురం పట్టణంలోని రామారావుపేట రైతు బజారులో వెంకటేశ్వర రైస్ మిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామిబాబు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ప్రారంభించారు.....

ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకు రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన సన్న బియ్యం, రా రైస్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాను ఎంపిక చేసి, స్థానిక రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ రైతు బజార్లు మరియు రైస్ మిల్లర్ స్టోర్ల ద్వారా బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మధ్యతరగతి, పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు లభిస్తుందని, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు......

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story