Peddapuram: గ్రామీణాభివృద్ధికి వికసిత్ భారత్ ఎంతో తోడ్పాటు.. ఎమ్మెల్యే
Peddapuram: సామర్లకోట మండలం పనసపాడులో నిర్వహించిన 'వికసిత్ భారత్' గ్రామీణ ఉపాధి, జీవనోపాధి హామీ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు.
Peddapuram: గ్రామీణాభివృద్ధికి వికసిత్ భారత్ ఎంతో తోడ్పాటు.. ఎమ్మెల్యే
Peddapuram: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్–గ్రామీణ ఉపాధి, జీవనోపాధి హామీ (వీబీ-గ్రామ్-జీ) కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో "వికసిత్ భారత్–2047" లక్ష్య సాధనలో ప్రతి గ్రామం భాగస్వామి కావాలని, గ్రామాల స్వయం సమృద్ధి, పరిశుభ్రత, హరితహారం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, ప్రజల భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని చినరాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ , Ex- సర్పంచ్ చీకట్ల వెంకటేష్, ఎంపీడీవో ఉమామహేశ్వరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




