Peddapuram: పెద్దాపురం రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాలు!

Peddapuram: పెద్దాపురం రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం కౌంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప. రూ.52కే స్టీమ్ బియ్యం, రూ.50కే రా బియ్యం లభ్యం.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 3 Aug 2026 2:11 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం రైతు బజార్‌లో తక్కువ ధరకే బియ్యం విక్రయాలు!

పెద్దాపురం: ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ, బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం అందించే ప్రత్యేక కౌంటర్‌ను స్వర్ణ పెద్దాపురం రైతు బజార్‌లో శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు,మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు,సివిల్ సప్లై.

డైరెక్టర్ తుమ్మల పద్మజ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె మంగలక్ష్మి రామారావు వైస్ చైర్మన్ చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు.ఆగస్టు 1 నుండి రైస్ మిల్లర్ల సౌజన్యంతో రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్లలో తగ్గించిన ధరలకే నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఇందులో భాగంగా బహిరంగ మార్కెట్‌లో ₹62.00 ఉన్న స్టీమ్ బియ్యం (బి.పి.టి.) ను ప్రత్యేక కౌంటర్లలో ₹52.00లకే, అలాగే బహిరంగ మార్కెట్‌లో ₹58.00 ఉన్న రా బియ్యం (బి.పి.టి.) ను ₹50.00లకే విక్రయిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 రైతు బజార్ల బియ్యం కౌంటర్లు మరియు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక పాయింట్ల ద్వారా ఈ విక్రయాలు సాగుతున్నాయి."మాటల్లో కాదు - చేతల్లో సంక్షేమం" అనే ధ్యేయంతో ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story