Peddapuram: పెద్దాపురం మహారాణి కాలేజీలో పోలీసుల అవగాహన సదస్సు

Peddapuram: పెద్దాపురం మహారాణి కాలేజీలో మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్‌పై పోలీసుల అవగాహన సదస్సు. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన సీఐ వైఆర్‌కే శ్రీనివాస్.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 29 July 2026 6:07 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం మహారాణి కాలేజీలో పోలీసుల అవగాహన సదస్సు

పెద్దాపురం: మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి,సైబర్ నేరాలు ,మోసాలు నివారణ మరియు డ్రగ్స్ వద్దు బ్రో , ఈగల్ క్లబ్ , లవ్ ట్రాప్స్, యాంటీ ర్యాగింగ్ , సామాజిక బాధ్యత లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, మహిళా చట్టాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో (POCSO) చట్టం, సైబర్ మోసాల, నేరాల నుంచి రక్షణ, రోడ్డు భద్రతా నియమాలు, శక్తి యాప్ (Shakthi App) వినియోగం, లవ్ ట్రాప్స్ పట్ల విద్యార్థు నీలు అప్రమత్తంగా ఉండాలని

ఎటువంటి ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడ కూడదని అదే విధంగా కాలేజీకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్న వెంటనే 100 లేదా 112 లేదా శక్తి యాప్ లేదా సిఐ నెంబర్ 9440904844 గాని తెలియజేయాలని , శక్తి టీమ్స్ సేవలు వినియోగించుకోవాలని ,తదితర అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, అపరిచితు లపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ, సమాజంలో సురక్షిత వాతావరణం ఏర్పడేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇంటి నేరాలు, బ్యాగ్ లిఫ్టింగ్, బైక్ దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి తెలిపి వారి తల్లిదండ్రులకు మరియు చుట్టుపక్కల వారికి కూడా తెలియజేయాలని చెప్పడం జరిగింది.

కాలేజీ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలలో తిరగరాదని, బస్ షెల్టర్ వద్ద బస్ వచ్చిన ఎక్క కుండా చిట్ చాట్ సేస్తూ కూర్చో రాదని, ర్యాగింగ్ కు పాల్పడిన , ఈవ్ టీజింగ్ కు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమo లో మహారాణి కళాశాల ప్రిన్సిపాల్శ్రీ.ఎ.సత్యనారాయణ మూర్తి సిబ్బంది. శ్రీ.ఎమ్.వి.ఎల్.భాను మూర్తి శ్రీమతి జి.జ్యోతి మయీ శ్రీమతి లక్ష్మి గారు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story