Peddapuram: పెద్దాపురం ఆర్డీవో ఇంట్లో దొంగతనం కేసు ఛేదనం!
Peddapuram: ఆర్డీవో నివాసంలో జరిగిన భారీ దొంగతనం కేసును కాకినాడ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.15 లక్షల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Peddapuram: పెద్దాపురం ఆర్డీవో ఇంట్లో దొంగతనం కేసు ఛేదనం!
Peddapuram: పెద్దాపురం ఆర్డీవో నివాసంలో జరిగిన భారీ దొంగతనం కేసును కాకినాడ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.15 లక్షల నగదుతో పాటు 105.4 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు వివరాలను శనివారం జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గత జూలై 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో పెద్దాపురం రామారావు పేటలోని డీఎల్పీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్డీవో నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడన్నారు.ఈ కేసులో అడ్డతీగల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మామిడి శివ కుమార్ @ శివను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇంటి వెనుక భాగంలోని మెష్ డోర్‌ను తెరిచి లోపలికి చొరబడిన నిందితుడు, రెండో గదిలోని కప్‌బోర్డులో ఉన్న తాళం సాయంతో ఇనుప అల్మారాను తెరిచాడని, అందులోని సుమారు 30 లక్షల విలువ చేసే 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి, 75 వేల నగదును దోచుకెళ్లాడని తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లభించని క్లిష్టమైన ఈ కేసును ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిశిత దర్యాప్తు పద్ధతులను వినియోగించి పోలీసులు ఛేదించారన్నారు.శనివారం వడ్లమూరు గ్రామ శివారులోని శ్రీ సాయి ఎంటర్‌ప్రైజెస్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద సంచరిస్తుండగా పెద్దాపురం సీఐ వైఆర్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిందితుడు శివను పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 15 లక్షల నగదుతో పాటు మొత్తం 105.4 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారన్నారు.




