Peddapuram: పెద్దాపురంలో 5వ రోజు 'ఇంటింటికీ తెలుగుదేశం' ప్రచారం

Peddapuram: స్వర్ణ పెద్దాపురం పట్టణంలో 5వ రోజు ఘనంగా 'ఇంటింటికీ తెలుగుదేశం'. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేసిన ముఖ్య నాయకులు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 1 Aug 2026 4:58 AM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో 5వ రోజు 'ఇంటింటికీ తెలుగుదేశం' ప్రచారం

పెద్దాపురం: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం పట్టణంలో 5వ రోజు నిర్వహించిన "ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్)" కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాగ్ గారు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ రాజా సూరిబాబు రాజు గారు, శ్రీ రంథి సత్యనారాయణ గారు, శ్రీ నూనె రామారావు గారు, శ్రీ శాస్త్రి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story