Kirlampudi: ముద్రగడ చిత్రపటానికి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి నివాళులు!

Kirlampudi: కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. కుటుంబ సభ్యులకు పరామర్శ.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 16 Aug 2026 1:57 PM IST
Kirlampudi
X

Kirlampudi: ముద్రగడ చిత్రపటానికి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి నివాళులు!

Kirlampudi: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద,ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిధున రెడ్డి అనంతరం ఆయన కుమారులు వైసిపి ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు, బాలులను పరామర్శించారు..

ముద్రగడతో ఆయనకున్న అనుభవాన్ని పంచుకున్నారు..

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ

ముద్రగడ పద్మనాభం మరణం వారి కుటుంబానికే కాదు వారి మిత్రులందరికీ కూడా తీరనిలోటని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మంత్రిగా పనిచేస్తున్న టైం లో నేను శాసనసభ్యుడిగా పనిచేశానని పెద్దిరెడ్డి తెలిపారు. తిరుపతికి ముద్రగడ ఎప్పుడు వచ్చినా నన్ను కలవకుండా వెళ్లేవారు కాదని గుర్తు చేసుకున్నారు.

వారు మరణించిన సమయంలో నేను మాల ధరించి ఉన్నాను కాబట్టి ఆ సమయంలో సంతాపం తెలపడానికి రాలేకపోయానని విచారణ వ్యక్తం చేశారు. ముద్రగడ లేని లోటు తీర్చ లేనిది అని, ముద్రగడ పద్మనాభం కుటుంభము కోసం మేము కృషి చేస్తామని తెలిపారు. వీరి వెంట మాజీ మంత్రులు కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, జ్యోతులు చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story