Amalapuram: పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది.
Amalapuram: పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం!
Amalapuram: డీఎస్సీ నియామకాలలో భారీ అక్రమాలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్.
పి.గన్నవరం కో..ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పి.గన్నవరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రిలే నిరాహార దీక్షా శిబిరం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి,మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా విచ్చేసి,పి.గన్నవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్నికల సమయంలో 'సూపర్ సిక్స్' పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం,నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి,వంటి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




