Pithapuram: పిఠాపురంలో అంగన్‌వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు!

Pithapuram: పిఠాపురంలో అంగన్‌వాడీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే, అక్షరాభ్యాస మహోత్సవం.

V. Ramakrishna, Pithapuram
Published on: 19 Jun 2026 4:19 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో అంగన్‌వాడీ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలోని అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం మరియు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చిన్నారులతో కలిసి అక్షరాభ్యాసం నిర్వహించి వారి విద్యా ప్రస్థానానికి శుభారంభం చేశారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేసి, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, చిన్నారుల వ్యక్తిత్వ వికాసానికి ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమని, అంగన్వాడి కేంద్రాలు పిల్లలలో విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి ప్రభుత్వం అనేక సంక్షేమ, విద్యా కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం దశ, దిశలు మారుతున్నాయని, విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. పిఠాపురం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.

చిన్నారుల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story