Pithapuram: పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న ఉప లోకాయుక్త పి. రజిని

Pithapuram: కార్తీక సోమవారం సందర్భంగా పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప లోకాయుక్త పి. రజిని; వేద ఆశీర్వచనం, ఈవో సత్కారం.

V. Ramakrishna, Pithapuram
Published on: 23 Nov 2026 8:39 PM IST
Pithapuram
X

Pithapuram: పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న ఉప లోకాయుక్త పి. రజిని

పిఠాపురం: పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్త గౌరవ శ్రీమతి పి. రజిని కుటుంబ సమేతంగా పిఠాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ సంప్రదాయాలను అనుసరించి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనం కల్పించి, పాదగయ క్షేత్ర విశిష్టతను, స్థల పురాణాన్ని వివరించారు. దర్శనానంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు.కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్

సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram