Pithapuram: పిఠాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Pithapuram: పిఠాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నేతలు, ప్రముఖులు.
Pithapuram: పిఠాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పిఠాపురం: పిఠాపురం పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నగేష్ పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ విచ్చేశారు.
ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఆర్యవైశ్య సంఘ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నగేష్ మాట్లాడుతూ భారతదేశం అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందని 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని, స్వేచ్ఛ స్వతంత్రాలతో పాటు సేవ తత్వం గల ఆర్యవైశ్యులు భారతదేశం మొత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
అనంతరంపిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక రమేష్ మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్రాలతోపాటు గాలిని స్వచ్ఛంగా పీల్చుకుని ప్రేరేపణ కూడా కలిగి ఉండాలని అది ఉండాలంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కుటుంబానికి ఒక మొక్క చొప్పున పిఠాపురం మొత్తం పచ్చని వనంగా మార్చాలని దానికి నా తోరపాటు అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యలమా చైర్మన్ దాంగేటి సత్యనారాయణమూర్తి, బోడా సతీష్, ఫైండా రాజ, ఇమిడిశెట్టి నాగేంద్ర, తాతాజీ, కొత్త సాయి కృష్ణ, కొత్త జగన్, రేపాక రామచంద్రరావు, పెనుగొండ అనుదీప్, కంచర్ల మహేష్, దండాల సాయి, కుసుమంచి సురేష్, మరియు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.




