Pithapuram: గొల్లప్రోలు మున్సిపల్ అభ్యర్థులతో పిఠాపురం సీఐ సమీక్ష సమావేశం!

Pithapuram: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులతో పిఠాపురం సీఐ సమావేశం నిర్వహించి, ఎన్నికల నిబంధనలు (MCC) పాటించాలని ఆదేశించారు.

RAMA KRISHNA, KKD
Published on: 25 Oct 2026 12:03 PM IST
Pithapuram
X

Pithapuram: గొల్లప్రోలు మున్సిపల్ అభ్యర్థులతో పిఠాపురం సీఐ సమీక్ష సమావేశం!

Pithapuram: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులతో పిఠాపురం సీఐ సమావేశం. రాబోయే గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఈరోజు పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పాటించవలసిన నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) గురించి వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకూడదని సూచించారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, పరస్పర సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.

ఈ సమావేశంలో గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD