Pithapuram: పిఠాపురం పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ పరిశీలన!

Pithapuram: పిఠాపురం పురపాలక సంఘం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్. 72 పోలింగ్ బూత్‌లకు 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత.

RAMA KRISHNA, KKD
Published on: 31 Oct 2026 12:49 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ పరిశీలన!

Pithapuram: పిఠాపురం స్థానిక పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది తరలివచ్చారు. 36 కౌన్సిల్ వార్డ్లకు చెందిన 72 పోలింగ్ బూతులకు సంబంధించి అదేవిధంగా 200 మంది పోలీసు బందోబస్తును నియమించడం జరిగింది.

అదేవిధంగా పిఠాపురం పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతున్న శిక్షణ తరగతులను కాకినాడ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ పరిశీలించడం జరిగింది.

ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బందికి ఎన్నికల విధులు, పోలింగ్ ప్రక్రియ, నిర్వహణ తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD