Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భారీ పర్యావరణ ర్యాలీ!
Pithapuram: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ జరిగింది.
Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భారీ పర్యావరణ ర్యాలీ!
పిఠాపురం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పిఠాపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ లో పాల్గొన్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో పురపాలక సంఘం కమిషనర్ కనకారావు, పాడా పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాడా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుకున్నారు. అనంతరం పాడా కార్యాలయం నుంచి ఉప్పాడ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి, ఉప్పాడ సెంటర్‌లో మానవహారం చేపట్టి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్, పిఠాపురం ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి బాబు , ఓదూరి కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి, పరిశుభ్రత మరియు పచ్చదనంలో ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదను అందించేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ ఎప్పటినుంచో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గ్రామాలు మరియు పట్టణాల నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంత పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉందని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
మా అందరి ఆరాధ్య నాయకులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల్లో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆయన మొదటి సంకల్పమని ఆ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని నియోజవర్గం మొత్తం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
త్వరలోనే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారధ్యంలో పదివేల మొక్కలు నాటడానికి శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ రూపకల్పన చేయడం జరిగిందని త్వరలోనే దాన్ని అమల్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవాని శంకర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ,సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు, పిఠాపురం ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బోజ్జకుమార్, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తోలేటి శిరీష, జనసేన పార్టీ పిఠాపురం మండల అధ్యక్షులు వెన్న జగదీష్, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు మామిడాల సూరిబాబు, గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్, పిఠాపురం అర్బన్ టౌన్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన నాగేశ్వరరావు, పిఠాపురం పట్టణ నాయకులు బొజ్జ లోవరాజు,చెల్లు బోయిన సతీష్,బాలిపల్లి రాంబాబు,జ్యోతుల సతీష్, పల్నాటి మధుబాబు,బస చిట్టిబాబు,వడ్డీ రాజశేఖర్, బీ.ఎన్ రాజు,కూటమి నాయకులు పాల్గొన్నారు.




