Pithapuram: అప్‌సైకిల్డ్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ల ఏర్పాటుకు రూ.10 లక్షల సీఎస్‌ఆర్ విరాళం

Pithapuram: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పిఠాపురంలో అప్‌సైకిల్డ్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ ఏర్పాటుకు ఎన్విజన్ ఎనర్జీ ఇండియా సంస్థ రూ.10 లక్షల సీఎస్‌ఆర్ చెక్కును అందించింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 28 Aug 2026 5:03 PM IST
Pithapuram
X

Pithapuram: అప్‌సైకిల్డ్ ప్లాస్టిక్ బస్ షెల్టర్ల ఏర్పాటుకు రూ.10 లక్షల సీఎస్‌ఆర్ విరాళం

పిఠాపురం: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో భాగంగా ఎన్విజన్ ఎనర్జీ ఇండియా సంస్థ పిఠాపురం పట్టణంలో అప్‌సైకిల్డ్ ప్లాస్టిక్ జోన్ బస్ షెల్టర్ ఏర్పాటుకు రూ.10 లక్షల చెక్కును పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి శివరామ్ ప్రసాద్ మరియు అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ మాధవి సమక్షయం లో పాడా కార్యాలయం వద్ద ఎన్విజన్ ఎనర్జీ ఇండియా సంస్థ ప్రతినిధులు అందచేయ్యడం జరిగింది.

ఎన్విజన్ ఎనర్జీ ఇండియా సంస్థ స్మార్ట్ విండ్ టర్బైన్లు, గ్రిడ్‌కు అనుసంధానిత యుటిలిటీ-స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ రంగాల్లో సేవలు అందిస్తోంది.

సీఎస్‌ఆర్‌లో భాగంగా పర్యావరణ విభాగం కింద చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ల్యాండ్‌ఫిల్‌కు చేరే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని అప్‌సైకిల్ చేసి పర్యావరణహిత బస్ షెల్టర్ల నిర్మాణానికి వినియోగించనున్నారు. పిఠాపురంతో పాటు కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కుప్పం ప్రాంతాల్లో మొత్తం 5 అప్‌సైకిల్డ్ ప్లాస్టిక్ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన గ్రీన్ వాల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ ప్రాంతంలో 10,000 మడ (Mangrove) మొక్కలను నాటేందుకు ఎన్విజన్ ఎనర్జీ ఇండియా ప్రణాళిక సిద్ధంగా ఉంది అని ఎన్విజన్ ఎనర్జీ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛమైన సాంకేతికత, పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎన్విజన్ ఎనర్జీ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story