Pithapuram: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం రైతుల పాలాభిషేకం
Pithapuram: ఏలేరు ద్వారా సాగునీరు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం రైతుల కృతజ్ఞతలు. చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు, రైతాంగం.
Pithapuram: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం రైతుల పాలాభిషేకం
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ రైతులకు సకాలంలో సాగునీరు అందించి రైతాంగానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రాంత రైతులు జీవితాంతం రుణపడి ఉంటారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు.
గురువారం పిఠాపురం నియోజకవర్గ రైతుల ఆధ్వర్యంలో గొల్లప్రోలు టోల్‌గేట్ సమీపంలోని పీబీసీ కాలువ పిడిందొడ్డి వద్ద నిర్వహించిన పాలాభిషేకం, కృతజ్ఞత సభలో పిఠాపురం ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండేం దొరబాబు, నాయకులు ఓదూరు కిషోర్, కొత్తపల్లి జెనసేన ఇంచార్జి రావు అక్షయ్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, "రైతు ఈ దేశానికి వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పంటలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న పిఠాపురం నియోజకవర్గ రైతుల సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న మా ఆరాధ్య నాయకులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి వెంటనే చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమన్వయం చేసి ఏలేరు వ్యవస్థ ద్వారా 1,000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేయించి సుమారు 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం పోశారు. ఇది రైతాంగానికి గొప్ప ఊరటను కలిగించింది" అని అన్నారు.
"పదవిని అధికారం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ . రైతు కష్టాన్ని తన కష్టంగా భావించి, ప్రతి ఎకరాకు నీరు చేరేలా కృషి చేసిన ఆయన సేవలను పిఠాపురం రైతాంగం ఎన్నటికీ మరచిపోదు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆచరణలో నిరూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ " అని కొనియాడారు.
రైతులు కూడా మాట్లాడుతూ, "ఎన్నో రోజులుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో మా సమస్యను గుర్తించి వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతు పక్షాన నిలిచిన ఈ సేవకు జీవితాంతం రుణపడి ఉంటాం" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి జైకొడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు.




