Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Pithapuram: పిఠాపురం కుమారపురంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. శ్రీ అభయ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 2 Sept 2026 5:42 PM IST
Pithapuram
X

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story