Pithapuram: పిఠాపురం పాదగయా క్షేత్రంలో వైభవంగా తెప్పోత్సవం, శమీ పూజ
Pithapuram: పిఠాపురం పాదగయా క్షేత్రంలో వైభవంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం, శమీ పూజ. విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం.
Pithapuram: పిఠాపురం పాదగయా క్షేత్రంలో వైభవంగా తెప్పోత్సవం, శమీ పూజ
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయా క్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10 వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ విజయ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేదపండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ పురుహితిక అమ్మవారికి శ్రీ చక్ర లక్ష కుంకుమార్చనలు, సహస్ర పుష్పార్చనలు, శ్రీ శత చండీ యాగ మహా పూర్ణాహుతి జరిగింది.
సాయంత్రం శమీ పూజ, నీరాజనం మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ అనంతరం పవిత్ర పాదగయ పుష్కరిణిలో శ్రీ స్వామి వారు అమ్మవార్ల తెప్పోత్సవం హంస వాహనంపై వైభవంగా నిర్వహించబడింది.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయా క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రావులపాలెం నాకు చెందిన శ్రీ దుర్గమ్మ భక్తి రంజని బృందం వారిచే ఆర్గనైజర్ మిరియాల సిద్దయ్య నేతృత్వంలో నిర్వహించిన భక్తి పాటలు మరియు భక్తి ప్రవచన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమం అనంతరం కళాకారులందరినీ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవస్థానం తరఫున ఘనంగా సన్మానించారు. ఆలయ వేదపండితులు కళాకారులకు వేదాశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను చీప్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు, శ్రీమతి కే ధనలక్ష్మి, దేవస్థానం సూపరింటెండెంట్ బొల్లం వీరభద్రరావు, రెడ్నం ప్రసాద్, పెంటపాటి సత్తిరాజు, కానూరు వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ కొప్పిశెట్టి దత్తాత్రేయ పర్యవేక్షించారు.




