Pithapuram: శతాబ్దాల నాటి 'ఇనాం భూముల' సమస్య పరిష్కారం..

Pithapuram: పిఠాపురం మహారాజుల కాలం నాటి ఇనాం భూముల సమస్యను కూటమి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు విజయవంతంగా పరిష్కరించారు.

RAMA KRISHNA, KKD
Published on: 2 July 2026 5:41 PM IST
Pithapuram
X

Pithapuram: శతాబ్దాల నాటి 'ఇనాం భూముల' సమస్య పరిష్కారం..

పిఠాపురం: మహారాజుల కాలం నుండి భూములను ఇనాములుగా ఇచ్చే రోజులలో మన పిఠాపురంలో ఎన్నో సంవత్సరాల సమస్య అయినా ఇనం భూముల సమస్యని పిఠాపురం రెవిన్యూ అధికారులు పరిష్కరించారు.

ఈ సమస్య పరిష్కారం వలన పిఠాపురం మండలంలో సుమారు 5700 మంది రైతు కుటుంబాలకు మేలు జరిగింది.

ఈ నేపథ్యంలో పిఠాపురం తాసిల్దార్ పి.గోపాలకృష్ణను రెవెన్యూ సిబ్బందిని పిఠాపురం మండల రైతులు సాలువ మరియు పుష్ప మాలలతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా సిబ్బందిని రైతులు ఘనంగా సన్మానించారు.

అనంతరం తాసిల్దార్ గోపాలకృష్ణని ఘనంగా రైతులకు మరియు సిబ్బంది సాలువ పుష్ప మాలలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు,జనసేన పార్టీ పిఠాపురం మండల ఇంచార్జ్ వెన్న జగదీష్,తోట ఏడుకొండలు తాసిల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఠాపురంలో ఉన్న భూములకు ఎంతో విలువను చేకూర్చే ఈ మాత్రమే కార్యక్రమం ఈ పిఠాపురంలో నిర్వహించడం ఎంతో అదృష్ట దాయికమని.

ఇటువంటి కార్యక్రమం మా చేతుల మీదుగా నిర్వహించడం పిఠాపురం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదలపవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. దీని ద్వారా రైతులకు సకాలంలో భూములు పై బ్యాంకులు లోన్లు ఇవ్వడం జరుగుతుందని ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తం బాబురావు,దాసరి బాబు, జాజి మొగ్గల సత్యనారాయణ,మాగాపు గొల్లబాబు ముప్పిడి, నారాయణరెడ్డి బత్తిన, వెంకటేశ్వరరావు,రెవిన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్,మండల తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story