Pithapuram: ఇందిరానగర్‌లో కమిషనర్ పర్యటన 24 గంటల్లో సమస్యలు తీర్చాలని ఆదేశం!
Pithapuram: పిఠాపురం ఇందిరానగర్‌లో మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు పర్యటన. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Pithapuram: ఇందిరానగర్‌లో కమిషనర్ పర్యటన 24 గంటల్లో సమస్యలు తీర్చాలని ఆదేశం!
Pithapuram: పిఠాపురం పురపాలక సంఘం పరిధిలోని 4వ సచివాలయం ఇందిరానగర్‌లో గౌరవ మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యలపై పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలను స్వయంగా కలిసి తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
శానిటేషన్, వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిశీలించి, 24 గంటల్లోగా పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్, టాప్ఇన్‌స్పెక్టర్ జి. జనార్ధన్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.




