Pithapuram: పిడుగుపాటు బాధితుడిని పరామర్శించిన జనసేన నేతలు!
Pithapuram: యు.కొత్తపల్లి పిడుగుపాటు ఘటనలో గాయపడిన మణికంఠను కాకినాడ ఆసుపత్రిలో పరామర్శించిన జనసేన ఇంఛార్జ్ రావు అక్షయ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ.
Pithapuram: పిడుగుపాటు బాధితుడిని పరామర్శించిన జనసేన నేతలు!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆదివారం రాత్రి యు. కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురైన ఘటనలో మృతి చెందిన నూకరాజు కుమారుడు మణికంఠ ప్రస్తుతం కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి మణికంఠను కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
కొత్త పల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మణికంఠకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ట్రస్ట్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మణికంఠకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. మణికంఠ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.




