Pithapuram: గొల్లప్రోలులో నిత్యావసర సరుకుల ప్యాకింగ్ పరిశీలించిన జేసీ అపూర్వ భరత్

Pithapuram: గొల్లప్రోలులో వరద బాధితుల నిత్యావసర సరుకుల ప్యాకింగ్ పరిశీలించిన జేసీ అపూర్వ భరత్. సరుకులు త్వరితగతిన అందించాలని అధికారులకు ఆదేశం.

V. Ramakrishna, Pithapuram
Published on: 28 Sept 2026 10:14 PM IST
Pithapuram
X

Pithapuram: గొల్లప్రోలులో నిత్యావసర సరుకుల ప్యాకింగ్ పరిశీలించిన జేసీ అపూర్వ భరత్

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... గొల్లప్రోలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురై, పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు పంపిణీ చేయనున్న నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు.

సోమవారం గొల్లప్రోలు మండల నిల్వ కేంద్రం లో(ఎంఎల్ఎస్ పాయింట్‌) జరుగుతున్న నిత్యావసర సరుకులు ప్రక్రియను జేసీ అపూర్వ భరత్ పరిశీలించారు.సిబ్బందితో మాట్లాడి సరుకులు నాణ్యత,బరువు ఇతర వివరాలు ఆరా తీశారు. ప్యాకింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ.. జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రంలో ఉంటున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు.

ఈ నేపథ్యంలో లబ్ధిదారుల కు అందించే 25 కేజీల బియ్యం,ఇతర సరుకుల పంపిణీ చేయడం జరుగు తుందన్నారు.ఈ ప్యాకింగ్ పనులు ముమ్మరం చేసి సత్వరమే లబ్ధిదారులకు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు.

నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన వంద శాతం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram