Pithapuram: పిఠాపురంలో తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటున్న తండ్రీకొడుకులు!
Pithapuram: పిఠాపురం పట్టణం మిరపకాయల వీధికి చెందిన వేమగిరి సతీష్ అనే యువకుడు తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.
Pithapuram: పిఠాపురంలో తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్‌ను వేడుకుంటున్న తండ్రీకొడుకులు!
Pithapuram: పిఠాపురం పట్టణంలోని మిరపకాయల వీధికి చెందిన వేమగిరి సతీష్ అనే యువకుడు తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడుతూ ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబానికి తల్లి లేకపోగా, తండ్రి వేమగిరి సింహాచలం కూడా ఊపిరితిత్తుల వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ఉన్నారు. సతీష్‌కు ఆధార్ కార్డు సమస్య ఉండటంతో ప్రభుత్వ పథకాలు అందకపోవడమే కాకుండా, ఏ ఆసుపత్రికి వెళ్లినా సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సతీష్‌కు అవసరమైన వైద్య సహాయం, పెన్షన్ సదుపాయం, అలాగే ఆధార్ కార్డు సమస్య పరిష్కారం చేయాలని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ తమ కుటుంబ పరిస్థితిని కూడా గుర్తించి సతీష్‌కు న్యాయం చేయాలని, వైద్య సహాయం అందించాలని, కిడ్నీ సంబంధిత పెన్షన్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతంగా విజ్ఞప్తి చేస్తున్నారు.




