Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నేతల పర్యటన!
Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉప్పాడలో జనసేన నేతల పర్యటన: నీటమునిగిన ప్రాంతాల పరిశీలన, బాధితులకు అండగా ఉంటామని రావు అక్షయ్, గంటా విజయ్ కుమార్ భరోసా.
Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నేతల పర్యటన!
పిఠాపురం: పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతినిధులుగా, భారీ వర్షాల కారణంగా ఉప్పాడ గ్రామంలో నీరు నిలిచిపోయిన ప్రాంతాలను ఉప్పాడ జనసేన పార్టీ ఇంచార్జ్ గంటా విజయ్ కుమార్ తో కలిసి కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ పరిశీలించడం జరిగింది.
ఈ వర్షాల కారణంగా మండలంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేదా సహాయం అవసరమైనా యు. కొత్తపల్లి మండల జనసేన పార్టీ అండగా ఉంటుందని స్థానికులకు తెలియజేయడం జరిగింది.




