Pithapuram: పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభం

Pithapuram: పిఠాపురంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని స్మృతి ఇరానీ, ఉపాసన కొణిదెల ప్రారంభించారు; దేశవ్యాప్తంగా ఇవే కేంద్రాలు.

V. Ramakrishna, Pithapuram
Published on: 20 Nov 2026 5:50 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభం

పిఠాపురం: పిఠాపురం పట్టణంలోని అగ్రహారం ప్రాంతంలో అపోలో ఫౌండేషన్–టోటల్ హెల్త్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ప్రారంభించారు.

తొలుత రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. కేంద్రంలో పిల్లల కోసం కల్పించిన ఆధునిక వసతులను స్మృతి ఇరానీ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్మృతి ఇరానీ, ఉపాసన కొణిదెల మాట్లాడుతూ, పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం తరహాలోనే దేశవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ఆధునిక విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.

ప్రాథమిక స్థాయిలోనే బాలల విద్యాభివృద్ధికి ఇటువంటి ఆధునిక కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. పిఠాపురంలో ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమని మరింత పేరు మరింత అభివృద్ధి పిఠాపురానికి లభిస్తాయని అన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram