Pithapuram: పిఠాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన పిడి డాక్టర్ ఎన్.వి. శివరామ్ ప్రసాద్.

V. Ramakrishna, Pithapuram
Published on: 15 Aug 2026 9:38 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (PADA) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా PADA ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందిస్తూ, పిఠాపురం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జి. రామ్ కుమార్, డిప్యూటీ ఎం.పి.డి.ఓ. ఎన్. శ్రీనివాస్, ఎన్.సి.సి. సిబ్బంది మరియు పాడా సిబ్బంది పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story