Pithapuram: పాడా పీజీఆర్ఎస్‌లో 68 అర్జీలు స్వీకరణ: ఏపీడీ వసంత
Pithapuram: పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 68 అర్జీలు అందాయని, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఏపీడీ వసంత మాధవి ఆదేశించారు.
Pithapuram: పాడా పీజీఆర్ఎస్‌లో 68 అర్జీలు స్వీకరణ: ఏపీడీ వసంత
Pithapuram: పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఏపీడీ పి వసంత మాధవి పాల్గొని, పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 68 అర్జీలు అందినట్లు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 14 , మున్సిపాలిటీకి 18 , పంచాయతీరాజ్ శాఖకు 09 , పోలిసు 6, ఇతర శాఖలకు సంబంధించి 21 అర్జీలు ఉన్నాయని తెలిపారు.
ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అర్జీదారులు తమ అర్జీ నమోదు వివరాలు, నమోదైన అర్జీ ప్రస్తుత స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేని అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, తమ అర్జీ నమోదు వివరాలు, ప్రస్తుత స్థితిని కూడా సదరు వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు,మండల రెవెన్యూ అధికారులు మరియు అన్ని సంబంధిత మండల స్థాయి అధికారులు, సంబంధిత డివిజన్ స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




