Pithapuram: పిఠాపురం పట్టణంలో క్లీన్ డ్రైవ్.. ఆక్రమణలు తొలగింపు

Pithapuram: పిఠాపురం పట్టణంలో సి.ఐ ఆధ్వర్యంలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు. రహదారుల ఆక్రమణలు, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 April 2026 9:26 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం పట్టణంలో క్లీన్ డ్రైవ్.. ఆక్రమణలు తొలగింపు

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.పిఠాపురం పోలీస్ ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన & ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ఈరోజు సి.ఐ ఆధ్వర్యంలో, పిఠాపురం టౌన్ ఎస్‌.ఐలు మరియు పోలీస్ సిబ్బంది కలిసి పిఠాపురంలోని చర్చి సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ మీదుగా కోట గుమ్మం సెంటర్, ఉప్పాడ సెంటర్ వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు మరియు ఇతరులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా షాపుల వస్తువులను రోడ్డుపై ఉంచడం, మార్గాన్ని ఆక్రమించడం, కొనుగోలుదారుల వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం వంటి అంశాలను గుర్తించి వెంటనే తొలగింపజేశారు.

అదేవిధంగా, సంబంధిత దుకాణదారులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించే చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు మరియు వ్యాపారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను స్వేచ్ఛగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవగాహన కల్పించారు.

ప్రత్యేక సూచనలు:

షాపులకు సంబంధించిన వస్తువులు రోడ్డుపై లేదా ఫుట్‌పాత్‌పై ఉంచరాదు. కొనుగోలుదారుల వాహనాలు రోడ్డుపై కాకుండా షాపు ముందు లేదా కేటాయించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేయించాలి. పాదచారులు సులభంగా నడిచేలా మార్గం ఖాళీగా ఉంచాలి.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలు మళ్లీ చేసిన యెడల కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. పిఠాపురం పట్టణంలోని దుకాణదారులు, వ్యాపారులు మరియు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పట్టణాన్ని క్రమబద్ధంగా ఉంచాలని కోరడమైనది.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story