Pithapuram: పిఠాపురంలో రాత్రివేళ పోలీసుల నాకాబంది!

Pithapuram: కాకినాడ ఎస్పీ ఆదేశాలతో పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి నాకాబంది. 71 వాహనాలు తనిఖీ, 11 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు.

RAMA KRISHNA, KKD
Published on: 6 Sept 2026 8:08 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో రాత్రివేళ పోలీసుల నాకాబంది!

Pithapuram: కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, 05.09.2026 రాత్రి 11:00 గంటల నుండి 06.09.2026 తెల్లవారుజామున 01:30 గంటల వరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ సెంటర్, ఉప్పాడ చర్చి మరియు పాదగయ ప్రాంతాల్లో నాకాబంది మరియు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ తనిఖీలలో భాగంగా మొత్తం 71 వాహనాలను తనిఖీ చేసి, 11 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేయడం జరిగింది. బ్రీత్ అనలైజర్ పరీక్షల ఆధారంగా నమోదు చేసిన కేసులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచి, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా / శిక్ష విధించబడును.

తనిఖీ చేసిన వాహనాల వివరాలు:

- లారీలు - 14

- బస్సులు - 04

- కార్లు - 09

- ఆటోలు - 09

- ద్విచక్ర వాహనాలు - 35

- మొత్తం - 71

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - 11

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story