Pithapuram: 'పాడ' కార్యాలయం పనితీరుపై స్వచ్ఛంద సంస్థల రౌండ్‌టేబుల్ సమావేశం
Pithapuram: పిఠాపురంలో పాడ కార్యాలయం పనితీరుపై స్వచ్ఛంద సంస్థల ఆందోళన. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపై చర్చ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి.
Pithapuram: 'పాడ' కార్యాలయం పనితీరుపై స్వచ్ఛంద సంస్థల రౌండ్‌టేబుల్ సమావేశం
పిఠాపురం: పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో పిఠాపురం పట్టణంలో ఉన్న "పాడ" కార్యాలయం పని తీరు పైన వివిధ స్వచంద సేవా సంస్థలు మరియు పుర ప్రజలు పాల్గొని చర్చించటం జరిగింది.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక మన పిఠాపురంలో పాడ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.కానీ సమస్యలు పరిష్కారం కావటం లేదు.
ముఖ్యంగా పరిష్కారం కోసం ఇచ్చిన ఆర్జీ సమస్య పరిష్కారం కాకపోయినా ప్రభుత్వ అధికారులు మాత్రం మూడు రోజులలో ఆన్లైన్ లో ఆర్జీ క్లోజ్ చెయ్యాలి అని బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారు.ఎన్ని ఆర్జీలు పెట్టినా అధికారులు మాత్రం నిమ్మకు నీరు పెట్టినట్లు ఉంటున్నారు.
ప్రశ్నించే నాయకులు లేకపోవటమే దీనికి కారణం అని అన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి నియోజకవర్గ సమస్యలు పైన అవగాహన ఉన్న వ్యక్తిని అక్కడ ఉంచటం మరియు నెలకు కానీ రెండు నెలకు కానీ పిఠాపురం ఎమ్మెల్యే ప్రజలకు కనిపించి మాట్లాడితే ప్రజలకు కూటమి ప్రభుత్వం పైన ఒక నమ్మకం,ఒక ధైర్యం కలుగుతుంది.
అలాగే ఆగష్టు 15న జండా వందనం సందర్భంగా కాకినాడలో ఆయన మాట్లాడుతూ 1000 కోట్లతో పిఠాపురం అభివృధి అని అన్నారు చాలా సంతోషం అది పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజల దగ్గరకు వచ్చి ఆయన స్వయంగా చెపితే బాగుంటుంది.ప్రతీ నెల పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పైన అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి ఆ విషయం స్వయంగా ప్రజలకు తెలియచేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకరరావు అల్లవరపు నగేష్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త పెమ్మరాజు సత్య రామచంద్రరావు, సిపిఎం నాయకులు కోనేటి రాజు, వైయస్సార్సీపి నాయకులు షేక్ మోహిది, మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ఈగల త్రిమూర్తులు, బిజెపి నాయకులు సూర్యనారాయణ, గరగా వీరబాబు, మున్సిపల్ కాంట్రాక్టర్ దాసరి కృష్ణ, తోట ప్రసాద్, లిటీల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కరుణ్ రాజు వివిధ స్వచంద సేవా సంస్థలు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు.




